తాడేపల్లిలో మేడే వేడుకలు

GNTR: ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా గురువారం తాడేపల్లిలో ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. సీపీఐ కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు జరిగాయి. నాయకులు కార్మిక చట్టాల పరిరక్షణ అవసరాన్ని వివరించారు. మేడే భావనతో శ్రమజీవుల హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పలువురు నేతలు పాల్గొన్నారు.