ఏపీ రాష్ట్ర సమాచార కమిషనర్‌గా నాయుడు నియామకం
Vsp: సమాచార హక్కు చట్టం–2005 కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్‌గా విశాఖ జిల్లా ప్రముఖ న్యాయవాది పరవాడ సింహాచలం నాయుడును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి మూడేళ్లు, 65 ఏళ్లు పూర్తయ్యే వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు.