ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన

SRCL: రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి ఆపరేషన్ శిబిరానికి స్పందన వచ్చింది. వేములవాడ పట్టణంలోని మాతృశ్రీ హాస్పిటల్ లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శిబిరం నిర్వహించారు. డాక్టర్లు చింతల ప్రభాకర్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ సంతోష్ కుమార్ బృందం ఆధ్వర్యంలో 110 మందికి రక్త, కంటి పరీక్షలు చేశారు.