103వ రోజు చేరుకున్న నిరాహార దీక్ష

103వ రోజు చేరుకున్న నిరాహార దీక్ష

KRNL: ఆదోని జిల్లాలో సాధన నిరాహార దీక్షలు గురువారనికి 103వ రోజుకు చేరాయి. జేఏసీ నేతలు హనుమంతు, సుభాష్ చంద్రబోస్, నాగరాజు తదితరులు దీక్షలో ఉన్నారు. కొందరు నేతలు దీక్ష విరమిస్తారని ప్రకటించినప్పటికీ, మరో వర్గం దీక్ష కొనసాగించింది. ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని, జిల్లా సాధించే వరకు పోరాటం ఆపరాదుని జేఏసీ నేతలు వెల్లడించారు.