జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు ఇవే..!
NLR: జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. 1. మైపాడు బీచ్: చల్లని సముద్ర గాలులతో సాయంత్రం వేళల్లో బాగుంటుంది. 2. పులికాట్ సరస్సు: అందమైన పక్షులు, ప్రకృతి దృశ్యాలు, బోటింగ్. 3. పెంచలకోన: కొండల మధ్య నరసింహ స్వామి ఆలయం, చల్లని జలపాతం. 4. రంగనాథ స్వామి ఆలయం: పెన్నా నది తీరాన ఉన్న చారిత్రక క్షేత్రం. 5. నేలపట్టు: పక్షుల అభయారణ్యం. 6. ఉదయగిరి కోట: ట్రెక్కింగ్, చారిత్రక కట్టడాల నిలయం.