ముగిసిన అంజన్న రాజగోపుర శిఖర కలశాల ప్రతిష్ఠాపన
ATP: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ రాజగోపురాలకు శిఖర కలశాల ప్రతిష్ఠాపన శుక్రవారం వైభవంగా ముగిసింది. నాలుగు రాజగోపురాల శిఖరాలకు 18 కలశాల ప్రతిష్ఠాపన చేశారు. గుంతకల్లు MLA గుమ్మనూరు జయరాం రాజగోపురంపై ప్రతిష్ఠంచారు. MLAలు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, సింధూరరెడ్డి, అమిలినేని సురేంద్రబాబు, బండారు శ్రావణి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.