అనకాపల్లిలో జాతీయ జెండా పండగ
AKP: అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ క్యాంపు కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపు రెడ్డి పరమేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానీయుల త్యాగాలను మరవకూడదన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని అన్నారు. దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు కృషి చేయాలని అన్నారు.