కమలాపురం వాసికి అంతర్జాతీయ చెస్ టోర్నీలో మూడో స్థానం
KDP: కమలాపురం మండలానికి చెందిన ఆర్వీ భగదీశ్వర్ రెడ్డి విజయవాడలో జరిగిన అంతర్జాతీయ ఐకోరిన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. 9 రౌండ్లలో 8 విజయాలు సాధించి, 50 పాయింట్లతో 1784 ఫిడే రేటింగ్‌కు చేరుకున్నారు. బుచ్చు హోల్డ్ పద్ధతిలో 592 మంది ఆటగాళ్లలో మూడవ స్థానం సంపాదించి రూ.50 వేల నగదు, ట్రోఫీని అందుకున్నారు.