అమ్మవారి విగ్రహ ప్రతిష్టలో సుగవాసి ప్రసాద్
అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని భరత్ గార్డెన్స్‌లో నిర్వహించిన మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, టీటీడీ మాజీ సభ్యుడు సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు కోరారు. ఈ కార్యక్రమంలో మండ్ల కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించగా, పెద్ద సంఖ్యలో భక్తులు, నాయకులు హాజరయ్యారు.