మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే
MBNR: భూత్పూర్‌లో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. గత పదేళ్ల పాలనలో మహిళల సంక్షేమం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుతం మహిళల అభివృద్ధికి వినూత్న పథకాలు అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు.