మంగళగిరి టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్
GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన బాధితుల సమస్యలు విన్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.