21 రోజులకు రూ 1.41 కోట్ల ఆదాయం

21 రోజులకు రూ 1.41 కోట్ల ఆదాయం

CTR: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపులో గత 21 రోజులకు రూ.1,41,68,426 ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. బంగారం 32 గ్రాములు, వెండి 1 కిలో 420 గ్రాములు సమర్పించబడగా, గో సంరక్షణ హుండీ ద్వారా రూ.8,449, నిత్య అన్నదానం హుండీ ద్వారా రూ.1,45,499 వచ్చాయి. ఆలయ అభివృద్ధికి చెక్కుల రూపంలో రూ.7,13,202 అందాయి.