రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతకు ఎపీ రెరా కట్టుబాటు
GNTR: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత, వినియోగదారుల రక్షణ కోసం ఎపీ రెరా దృఢంగా పని చేస్తున్నట్టు అథారిటీ ఛైర్‌పర్సన్ ఆరే శివారెడ్డి వెల్లడించారు. తుళ్లూరు మండలం రాయపూడిలోని కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు, ఏజెంట్ తప్పనిసరిగా www.rera.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.