'వేతనంగా రూ.18 వేలు ఇవ్వాలి'
MHBD: డోర్నకల్‌లోని గాంధీ కూడలిలో ఆశా కార్యకర్తలు ఇవాళ ధర్నా చేపట్టారు. ఈ క్రమంలోనే వారు వేతనం రూ. 18వేలుగా నిర్ణయించి, ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. పుర వీధుల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం అర్హులైన వారిని ఏఎన్‌ఎంలుగా నియమించాలని, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ తహసీల్దార్, పుర కమిషనర్‌కు వినతి పత్రాలు అందించారు.