కారంచేడులో ఎరువుల దుకాణాలను పరిశీలించిన ఎస్సై

కారంచేడులో ఎరువుల దుకాణాలను పరిశీలించిన ఎస్సై

BPT: కారంచేడు మండల పరిధిలోని కుంకులమర్రు గ్రామంలోని ఎరువుల దుకాణాన్ని ఎస్సై ఖాదర్ బాషా మంగళవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు, నెలవారి స్టాక్ వివరాలను యజమానులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎరువులు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారని ఆరా తీశారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.