'ప్రభుత్వ ఆస్తి ధ్వంసం ప్రజాస్వామ్య విరుద్ధం'

'ప్రభుత్వ ఆస్తి ధ్వంసం ప్రజాస్వామ్య విరుద్ధం'

NLG: మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ యువజన విభాగం చిట్యాల మండల అధ్యక్షులు తుమ్మల నాగరాజు రెడ్డి ఖండించారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. హామీల అమలును పక్కనపెట్టి దాడులను ప్రోత్సహించడం సరికాదన్నారు. పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.