అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లు

E.G: ఫోక్స్‌పేట అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా తాబేళ్లు అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు రేంజ్ అధికారి కరుణాకర్ తెలిపారు. మైదాన ప్రాంతమైన రామచంద్రపురం నుంచి ఏజెన్సీ ప్రాంతం మీదుగా ఒడిస్సా ప్రాంతానికి ఈ తాబేళ్ల అక్రమ రవాణా పట్టుబడ్డ వాహనంలో 30 బస్తాల్లో సుమారు1000 వరకు తాబేళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అటవీశాఖ సిబ్బంది తెలిపారు.