VIDEO: సమైక్యత ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే
SKLM: ఎచ్చెర్ల మండలం చిలకపాలెం నుంచి కేశవ రెడ్డి స్కూల్ వరకు ఇవాళ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సమైక్యత ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు పాల్గొన్నారు. ఏక్ భారత్-శ్రేష్ట భారత్ అనే నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. యువతలో దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ర్యాలీని నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.