బాపట్ల నెహ్రూ యువ కేంద్రం బలోపేతం చేయాలి: ఎంపీ
BPT: బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఢిల్లీలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవియాను కలిశారు. బాపట్ల నెహ్రూ యువ కేంద్రం (NYKS) కార్యకలాపాలను విస్తరించాలని కోరారు. యూత్ క్లబ్‌లు, వాలంటీర్ల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. యువతలో నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం పెంచేలా జిల్లా, మండల స్థాయిల్లో కార్యక్రమాలు చేపట్టాలని, నిధులు కేటాయించాలని కోరారు.