సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KKD: అభాగ్యుల జీవితాల్లో కాంతిరేఖలా సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతోందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సోమవారం సామర్లకోట మండలం కొప్పవరం గ్రామంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజప్ప పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.