ఖాళీ స్థలాలు శుభ్రంగా ఉంచాలి: కమీషనర్

ఖాళీ స్థలాలు శుభ్రంగా ఉంచాలి: కమీషనర్

KRNL: నగర పరిధిలోని ఖాళీ స్థలాలను అపరిశుభ్రంగా ఉంచరాదని, వెంటనే పిచ్చిమొక్కలు, చెత్త తొలగించాలని నగర పాలక కమీషనర్ పి.విశ్వనాథ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖాళీ స్థలాలు దోమలు, పశువులకు నిలయమవుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.