VIDEO: బస్ స్టాండ్ తనిఖీ.. అధికారులను మందలించిన MLA
ASF: కాగజ్ నగర్ పట్టణంలోని బస్ స్టాండ్, పరిసరాలను ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్‌తో కలిసి MLA హరీష్ బాబు సోమవారం తనిఖీ చేశారు. దుర్గంధం వెదజల్లుతున్న పరిసరాలను, టాయిలెట్లు, పారిశుధ్యం లేని బస్టాండ్ ఆవరణను చూసి ఆర్టీసీ అధికారులను మందలించారు. బస్టాండ్ అభివృద్ధి కోసం ప్రతిపాదనలు తనకు అందిస్తే ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు.