ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

విజయనగరం: శృంగవరపుకోట మండలంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందాడు. ధర్మవరం గ్రామంలో రాయి కోసం కొండపై తాడు సహాయంతో అప్పారావు అనే వ్యక్తి పనులు చేస్తున్నాడు. ప్రమాదశావత్తు తాడు జారి తలకి ఇరుక్కుని అప్పారావు (45) మరణించాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.