ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన
కృష్ణా: రామన్నపూడి గ్రామంలో ఎస్సై చంటిబాబు మంగళవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ట్రాఫిక్ నియమాలను పాటించని వాహనదారులకు అవగాహన కల్పించి, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఎస్సై సూచించారు.