శ్రీకాకుళం తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లదేశ్ బోటు

శ్రీకాకుళం తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లదేశ్ బోటు

శ్రీకాకుళం సముద్ర తీరానికి బంగ్లాదేశ్ బోటు కొట్టుకొచ్చింది. ఆ బోటులో దాదాపు 13 మంది మత్స్యకారులు ఉన్నారు. దారి తప్పడంతో మూసవానిపేట తీరానికి చేరుకున్నారు. సతమతమవుతున్న బంగ్లాదేశ్ మత్స్య కారులను స్థానికులు, మెరైన్ పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.  ఆహారం, ఇంధనం అయిపోవడంతో జాలరులు దయనీయ పరిస్థితిలో ఉన్నారు. దేశ సరిహద్దులు దాటినందుకు పోలీసులు కేసు నమోదు చేస్తామన్నారు.