కార్తీక మాసంలో నిజరూప దర్శనంలో జంబుకేశ్వరుడు
ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన స్వయంభు జంబుకేశ్వరుడు కార్తీకమాసం రెండవ సోమవారం ప్రత్యేక పూజలు అందుకున్నాడు. పురోహితులు రామకృష్ణ స్వామివారికి పంచామృత, ఏకవార రుద్రాభిషేకం చేపట్టి మంగళ నైవేద్యాలు అందించారు. నిజరూప దర్శనంలో జంబుకేశ్వరుడు భక్తులకు దర్శనం ఇచ్చాడు. కార్తీకమాసంలో శివుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురోహితులు సూచించారు.