ఈనెల 17న ప్రదోష పూజ
CTR: కానిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 17న త్రయోదశిని పురస్కరించుకొని ప్రదోష పూజ నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారికి, నందీశ్వరునికి ఏకకాలంలో అభిషేకం నిర్వహిస్తామన్నారు.