పల్లెలు ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నాయి: ఎమ్మెల్యే

తూ.గో: అనపర్తి మండలం రామవరం గ్రామంలో పలు అభివృద్ధి పనులను శనివారం ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన మంచినీటి ట్యాంకును, నూతనంగా నిర్మించిన సీసీ రహదారులు, డ్రైనేజీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో పల్లెలు ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నాయన్నారు.