'ఎన్నికలు ముగిసే వరకు మరింత అప్రమత్తంగా ఉండాలి'
KMM: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పక్రియ ముగిసే వరకు పోలీస్ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ DCP ప్రసాద్ రావు అన్నారు. శనివారం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ బందోబస్తు సిబ్బంది విధివిధానాలపై అవగాహన నిర్వహించారు. పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించాలని, ఆకస్మిక సమస్యలు ఎదురైతే ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.