ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

KMM: ఫ్యాన్‌కు ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఖమ్మం జిల్లా, కూసుమంచి మండల పరిధిలోని, పోచారం గ్రామంలో జరిగింది. రెడ్డి మల్ల ప్రశాంత్ (24) ఖమ్మం నగరంలో ఒక మెకానిక్ షెడ్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన ప్రశాంత్ ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.