ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

ELR: చింతలపూడి ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమీప గ్రామాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుండి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అర్జీలను స్వీకరించారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వివరించారు.