నేడు హైదరాబాద్‌కు రానున్న రాజ్‌నాథ్ సింగ్

నేడు హైదరాబాద్‌కు రానున్న రాజ్‌నాథ్ సింగ్

రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఇవాళ సా.5 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి రానున్నారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారు. అనంతరం పికెట్ పార్క్‌లో వాజ్‌పేయ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.