శ్రీశైలంలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
NDL: శ్రీశైలం గిరిజన గురుకుల పాఠశాలలో బ్యాక్ లాగ్ ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ PO పీవీ ఎస్ నాయుడు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యాసంవత్సరంలో చేరే ఎస్టీ విద్యార్థులు అర్హులన్నారు. 6వ తరగతిలో 64, 7లో 49, 8లో 42, 9వ తరగతిలో 31 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇతర వివరాలకు 9490957267 నంబర్‌కు సంప్రదించాలన్నారు.