108 అంబులెన్స్‌లో డెలివరీ.. తల్లి, బిడ్డ క్షేమం

108 అంబులెన్స్‌లో డెలివరీ.. తల్లి, బిడ్డ క్షేమం

MDK: నిజాంపేట మండలం వెంకటాపూర్ తండాకు చెందిన కవిత అనే గర్భిణికి పురిటినొప్పులు రావడంతో, 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే నొప్పులు అధికమయ్యాయి. 108 ఈఎంటీ స్వామి అప్రమత్తమై అంబులెన్స్‌లో చాకచక్యంగా ప్రసవం చేయగా, ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.