గొకార్ జండా కాలనీలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం

KRNL: ఆదోని గొకార్ జండా కాలనీలో గురువారం టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శేకుణ్ బాను ప్రజలకు క్షయ వ్యాధి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రోగులకు ఉచిత మందులు, నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. పేద క్షయ రోగులను దత్తత తీసుకోవాలని దాతలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు.