కరెంట్ షాక్‌తో రైతు మృతి
VKB: పరిగి మున్సిపల్ పరిధిలో దారుణం జరిగింది. కిష్టమ్మ గుడి తండాకు చెందిన కేతావత్ మోహన్ నాయక్ పొలం పనులు చేస్తుండగా అనుకోకుండా కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికులు వెంటనే అధికారులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.