శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
AP: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 80,841 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.