శబరి ఎక్స్‌ప్రెస్‌కు కొత్త నంబర్లు
HYD: సికింద్రాబాద్-త్రివేండ్రం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్ వేగాన్ని పెంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చేందుకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. ఈ మార్పును SEP 29 నుంచి అమలు చేయనున్నట్లు దక్షిణ మధ్యరైల్వే తెలిపింది. ప్రస్తుతం శబరి ఎక్స్‌ప్రెస్ 17229/30 నంబర్లతో నడుస్తుండగా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా 20629/30 నెంబర్లు కేటాయించింది.