బైక్ ఢీకుని వృద్ధుడికి తీవ్ర గాయాలు
WNP: ఆత్మకూరు పట్టణ సమీపంలోని HP పెట్రోల్ పంప్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. బైకుపై వస్తున్న ఉంద్యాల గ్రామానికి చెందిన నరేష్.. అడ్డుగా వచ్చిన వృద్ధుడిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే 108 వాహనంలో గాయపడిన వృద్ధుడిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.