సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి రద్దు
NRML: పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో వచ్చే సోమవారం కలెక్టరేట్‌లో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నియమావళి కొనసాగుతున్నంత వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడదని, కోడ్ ముగిసిన వెంటనే ప్రజావాణిని యథావిధిగా ప్రారంభిస్తామన్నారు.