ఉచిత విద్యుత్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
SRPT: ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఎలక్ట్రిక్ హౌస్ వైరింగ్‌లో 30 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ తెలిపారు.10వ తరగతి పాసై, 19-45 ఏళ్ల మధ్య ఉన్న నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల వారు ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలి. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తారు. 9701009265ను సంప్రదించాలన్నారు.