వెటర్నరీ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే
JGL: కోరుట్ల పట్టణంలోని పీవీ నర్సింహారావు వెటర్నరీ & సైన్స్ కళాశాలను ఇవాళ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సందర్శించారు. పశువైద్య సేవలు, ల్యాబ్ సదుపాయాలు, చికిత్సా విధానాలు, ఆధునిక పరికరాల వినియోగాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతలో మాట్లాడుతూ.. చదువు, ప్రాక్టికల్ ట్రైనింగ్, ఫీల్డ్ అనుభవం, భవిష్యత్ లక్ష్యాల గురించి ఆరా తీశారు.