ఈనెల 9న అన్ని మండల కేంద్రాల్లో నిరసన ధర్నా
KMM: జిల్లాలో మొక్కజొన్న, వరి కొనుగోళ్లలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 9వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ మంగళవారం పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఈ ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.