గురువారం: నేటి తిరుమల సమాచారం
TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 65,354 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 25,550 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.