యూరియా కోసం రైతుల అవస్థలు

యూరియా కోసం రైతుల అవస్థలు

SRPT: వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నా, యూరియా కొరతతో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పోనుగోటి రంగా విమర్శించారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలో  ఆయన మాట్లాడుతూ.. సొసైటీల్లో ఒక బస్తా యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారని అన్నారు.