33వ వార్డులో ఘనంగా హోలీ వేడుకలు
సిరిసిల్ల పట్టణంలోని 33వ వార్డులో హోలీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో 33వ వార్డు కౌన్సిలర్ కొండ వర్షిణి-నరేష్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డు ప్రజలు హోలీ పండుగను శాంతియుతంగా, స్నేహభావంతో జరుపుకోవాలని సూచించారు. ఈ హోలీ వేడుకలో పవన్, చందు, శ్రీనాథ్, అరవింద్, అభి, సృజన్, ముబిన్ భాగస్వామ్యులయ్యారు.