అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య యత్నం
SRCL: ఇల్లంతకుంట మండలం జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పండుగ చంద్రకళ అత్తింటి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడింది. చంద్రకళ భర్త చక్రపాణి చనిపోవడంతో ఆస్తి తన పేరు మీద చేయమని అడిగినందుకు అత్తింటి వారు, కొందరు అధికారులు భరించలేని మాటలు అన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈమె ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.