దేశ నిర్మాణంలో BJPది కీలక పాత్ర: లోకేష్
AP: భారత్‌ను బలమైన దేశంగా మార్చడంలో BJP కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు. ఆ పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా NDA భాగస్వామ్య పార్టీలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి BJP అందిస్తున్న సుస్థిర మద్దతు ఎంతో విలువైనదన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనకు తామంతా కట్టుబడి ఉన్నామంటూ X వేదికగా వెల్లడించారు.