ప్రేమ పేరుతో బాలికను గర్భవతి చేశాడు

ప్రేమ పేరుతో బాలికను గర్భవతి చేశాడు

మేడ్చల్ జిల్లాలో ఓ యువకుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి గర్భవతిని చేశాడు. ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామి తెలిపిన వివరాలిలా.. స్థానికంగా మటన్‌షాప్ నిర్వహిస్తున్న 24 ఏళ్ల యువకుడు ఎదురుగా నివాసముండే 17ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించి దగ్గరయ్యాడు. బాలిక అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లగా గర్భవతి అని తేలింది.