ఉమ్మడి కృష్ణా జిల్లాలో తీవ్ర ఉత్కంఠ

కృష్ణా: AP క్యాబినెట్ సబ్ కమిటీ ఈరోజు సమావేశం కానుంది. ఈ సమావేశంలో జిల్లాల పేర్లు, సరిహద్దులు మార్పులపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో నూజివీడు, గన్నవరం, పెనమలూరును NTRలో, కైకలూరును కృష్ణాలో నందిగామ, జగ్గయ్యపేటలను అమరావతిలో కలపనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా NTR జిల్లాను విజయవాడగా మారుస్తారా? కృష్ణా జిల్లాకు NTR జిల్లా పేరు పెడతారా అనే చర్చ జరుగుతోంది.